Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Namasthe Telangana · NT News telugu · 2 min read at Namasthe Telangana
Greater Noida : గ్రేటర్ నోయిడాలో భారీ డ్రగ్స్ తయారీ ల్యాబ్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు గుర్తించారు. అంతేకాదు.. ఈ ల్యాబ్ నుంచి రూ.45 కోట్ల విలువైన డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తయారు చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో ఒక విదేశీయుడు కూడా ఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలివి. డ్రగ్స్ తయారీకి సంబంధించి ఎన్సీబీకి ఇంటెలిజెన్స్ సమాచారం అందింది.
దీని ప్రకారం ఉత్తర ప్రదేశ్, గ్రేటర్ నోయిడా పరిధి, గౌతమ్ బుద్ధా నగర్ జిల్లా, జహంగాబాద్ కదాల్పూర్ గ్రామంలో విదేశీయులు ఈ డ్రగ్స్ తయారు చేస్తున్నారు. నిందితులు రెండు వేర్వేరు ఇండ్లను అద్దెకు తీసుకుని డ్రగ్స్ తయారు చేస్తున్నారు. ఒక ఇల్లును రా మెటీరియల్ నిల్వ చేసేందుకు వాడుతున్నారు. ఇంకో ఇంటిని ఈ మెటీరియల్ను ప్రాసెస్ చేసేందుకు, డ్రగ్స్ తయారీకి వినియోగిస్తున్నారు. దీనిపై అందిన సమాచారంతో అక్టోబర్ 16న ఎన్సీబీ అధికారులు ఆ ఇండ్లపై దాడి చేశారు.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/national/drug-making-labs-busted-in-uttar-pradesh-greater-noida-amphetamine-worth-rs-45-crore-seized-foreigner-arrested-2539392
framing not published · 13 outlets covered this story, below the floor for a split