Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
Greater Noida : ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని గ్రేటర్ నోయిడా (Greater Noida) లో శుక్రవారం రాత్రి నూడుల్స్ (Noodles) తిని, టీ (Tea) తాగి పడుకున్న ఐదుగురు కుటుంబసభ్యులు తెల్లారేసరికి మృతిచెందిన సంగతి తెలిసిందే. అయితే నూడుల్స్, టీలో కల్తీయే కారణమని ముందుగా అంతా భావించారు. కానీ వారి మృతికి నూడుల్స్, టీ కల్తీ కారణం కాదని పోలీసుల దర్యాప్తులో తేలింది. వారు విషం ప్రభావంతో మరణించినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది.
వారికి ఫుడ్ పాయిజనింగ్ కాలేదని పోలీసులు తెలిపారు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఆస్తి వివాదం కారణంగా ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని వెల్లడించారు. ఆత్మహత్యకు ముందు మృతుడు మహేష్ తన ఫోన్లో రికార్డ్ చేసిన వాయిస్ నోట్ ద్వారా ఈ విషయాన్ని గుర్తించామన్నారు. ఆస్తి కోసం ఇద్దరు సోదరీమణులు, బావ తమ కుటుంబాన్ని కొన్నేళ్లుగా వేధిస్తున్నట్లు మహేష్ తన వాయిస్ నోట్లో పేర్కొన్నారు. వారి వేధింపులు తాళలేక కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పారు.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/national/noodles-not-the-culprit-cops-say-greater-noida-family-died-by-suicide-amid-feud-2539352
framing not published · 81 outlets covered this story, below the floor for a split