Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
దక్షిణాఫ్రికా : సంచలన శీర్షికలతో ప్రజల్లో అపోహలు కలిగించడం సమంజసం కాదని బీఆర్ఎస్ ఎన్నారై దక్షిణాఫ్రికా ( BRS NRI South Africa ) శాఖ నాయకులు గుర్రాల నాగరాజు (Gurrala Nagaraju ) అన్నారు. కేసీఆర్పై బురదజట్టడం కోసం తప్పుడు కథనాలు ప్రచురించడం సరైనది కారదని పేర్కొన్నారు. ఏం రాసినా..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటేనని వెలుగు పత్రికకు సూచించారు.
కేసీఆర్ ఫామ్హౌస్ ( KCR Farm House ) కు మళ్లిన కొండపోచమ్మ కథనాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రశ్నించే హక్కు పత్రికలకు ఉంది. అదే సమయంలో వాస్తవాలను నిర్ధారించుకొని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూడా ఉందని హితవు పలికారు. ఆధారాలు చూపకుండా కేసీఆర్పై ఆరోపణలు చేసి, వాటినే నిజాలుగా ప్రచారం చేస్తే సహించబోమని హెచ్చరించారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో గట్టిగా ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/nri/it-is-a-mistake-to-assume-that-anything-can-be-written-and-that-people-will-believe-whatever-is-presented-gurrala-nagaraju-2539483
framing not published · 7 outlets covered this story, below the floor for a split