హైదరాబాద్ ఎస్ఆర్ అకాడమీకి డీమ్డ్ వర్సిటీ హోదా
V6 Velugu · V6 Velugu · 1 min read at V6 Velugu
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లోని ఎస్ఆర్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కు కేంద్ర ప్రభుత్వం డీమ్డ్- యూనివర్సిటీ హోదా మంజూరు చేసిందని ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ చైర్మన్, వర్సిటీ ఛాన్సలర్ ఎ. వరదా రెడ్డి తెలిపారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. దేశవిజన్–2047 సాధనలో తమ వర్సిటీ వ్యూహాత్మక పాత్ర పోషిస్తుందన్నారు. సంప్రదాయ ఉన్నత విద్యకు మించి అత్యాధునిక ఇంజినీరింగ్, డిజిటల్ ఆరోగ్య సంరక్షణ, మానవీయ సృజనాత్మక విద్యలను అనుసంధానిస్తూ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన రీసెర్చ్, ఆవిష్కరణల కేంద్రంగా వర్సిటీని తీర్చిదిద్దుతున్నట్లు…
ఇండియా సెమీకండక్టర్ మిషన్, నేషనల్ క్వాంటం మిషన్ లక్ష్యాలకు తగ్గట్టుగా సెమీకండక్టర్ డిజైన్, క్వాంటం కంప్యూటింగ్, ఏఐ, రోబోటిక్స్, బయోఇన్ఫర్మాటిక్స్ వంటి కోర్సులను తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ కొత్త డీమ్డ్ వర్సిటీ మేడ్చల్ జిల్లాలోని రాంపల్లి దాయర వద్ద ఏర్పాటైనట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ వర్సిటీ ప్రో ఛాన్సలర్ మధుకర్ రెడ్డి, వీసీ దీపక్ గార్గ్, ప్రో వీసీ మహేశ్, డీన్ డాక్టర్ ఎ. అర్చన రెడ్డి పాల్గొన్నారు.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/sr-academy-in-hyderabad-granted-deemed-to-be-university-status-
framing not published · 184 outlets covered this story, below the floor for a split