హైదరాబాద్ లో క్రిప్టో కరెన్సీని క్యాష్ గా మారుస్తామని రూ.21 లక్షల మోసం..
V6 Velugu · V6 Velugu · 1 min read at V6 Velugu
హైదరాబాద్ లో క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ సైబర్ మోసం జరిగింది.క్రిప్టో కరెన్సీని క్యాష్ గా మారుస్తామంటూ బంజారాహిల్స్ కి చెందిన ఓ వ్యాపారిని రూ.21 లక్షలు మోసం చెసారు కేటుగాళ్లు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. బంజారాహిల్స్కు చెందిన వ్యాపారవేత్త షానవాజ్ దగ్గర పనిచేసే నాగ అమరేందర్ క్రిప్టో లావాదేవీలను పర్యవేక్షించేవాడు. ఈ నెల 11న రూ.25 లక్షల నగదుతో అమరేందర్ను నాంపల్లికి రప్పించి, బజార్ఘాట్లోని హిమాలయన్ హోటల్ సమీపంలో లావాదేవీల కోసం సమావేశమయ్యారు.
ముందస్తు ప్రణాళికతో నిందితులు బాధితుల కళ్లలో పెప్పర్ స్ప్రే చల్లి దాడి చేసి నగదు బ్యాగుతో పరారయ్యారు. పెనుగులాటలో రూ.4 లక్షలు కిందపడిపోవడంతో మిగిలిన నగదును ఎత్తుకెళ్లారు.ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి రూ.11.50 లక్షల నగదు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు. బషీర్బాగ్లోని డీసీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కేసు వివరాలు తెలిపారు.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/21-lakhs-of-crypto-currency-fraud-at-banjarahills-of-hyderabad
framing not published · 81 outlets covered this story, below the floor for a split