Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Namasthe Telangana · NT News telugu · 2 min read at Namasthe Telangana
Harish Rao | జర్మనీలో ఉద్యోగాలు కల్పిస్తామని ఆశ చూపిస్తూ నిరుద్యోగ యువతను దోచుకునే వ్యవస్థగా రాష్ట్ర ప్రభుత్వ సంస్థ టామ్కామ్ను మార్చేశారని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు మండిపడ్డారు. సుమారు 15 జిల్లాలకు చెందిన 70 నుంచి 75 మంది యువత నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.4.10 లక్షలు వసూలు చేశారని, పరీక్షలు, బీమా, వీసా ఖర్చులు కలిపితే ఈ మొత్తం సుమారు రూ.4.5 లక్షలకు చేరుతుందని పేర్కొన్నారు. ఇది జరిగి రెండేళ్లకు పైగా గడిచినా.. ఎంపికైన 24 మంది అభ్యర్థుల్లో ఒక్కరు కూడా తమకు ఇంటర్యూ నిర్వహించిన జర్మనీ కంపెనీ ప్రతినిధుల పేర్లను చెప్పలేకపోయారని అన్నారు.
ప్రభుత్వ హామీని నమ్మిన పేద రైతు కుటుంబాలు మూడేళ్ల ఆదాయాన్ని ఖర్చు చేశాయని, తల్లులు, భార్యల బంగారాన్ని తాకట్టు పెట్టి, అప్పులు చేసి డబ్బులు చెల్లించారని హరీశ్‌రావు తెలిపారు. ఇప్పటికీ ఆ అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. జర్మన్ భాషలో బీ1 పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఆ తర్వాత బీ2 పరీక్షలోనూ ఉత్తీర్ణులు కావాలని చెప్పారని హరీశ్‌రావు పేర్కొన్నారు. మరోవైపు, తొమ్మిది మంది అభ్యర్థులు జర్మనీకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని టామ్‌కామ్ ప్రచారంలో ప్రకటించినప్పటికీ, వారిలో ఒక్కరు కూడా జర్మనీకి వెళ్లలేదని అన్నారు.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/telangana/harish-rao-slams-revanth-reddy-govt-for-cheat-unemployed-youth-with-germany-jobs-and-tomcom-2539495
framing not published · 2 outlets covered this story, below the floor for a split