Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Namasthe Telangana · NT News telugu · 2 min read at Namasthe Telangana
Harish Rao | రైతులను కానీ, ప్రజలను కానీ మీ సావు మీరు సావండి అని రేవంత్ రెడ్డి అంటుండని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి ఏదైనా పైసలు పెట్టి కొనొచ్చు కానీ నీళ్లు కొంటమా..? నీళ్లను కొనలేము అంటున్నడు. మరి అంత ప్రాధాన్యత కలిగిన నీళ్ల విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నావ్. నేను మొదటి నుంచి చెబుతున్నా.. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని.. దానికి ఈ రూంలో ఉన్న జర్పలిస్టులే సాక్ష్యమన్నారు.
పాపం చనిపోయిన మా పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా పోరాడిండు. దేవాదులలో నీళ్లొస్తున్నాయి.. 10 మోటార్లు నడవాల్సిన చోట మూడే మోటార్లు ఎందుకు నడుపుతున్నవ్.. ఎల్నినో వస్తుందంటున్నరు..3 మోటార్లు ఎందుకు నడుపతున్నవ్.. 10 మోటార్లు నడుపు.. నీళ్లు ఎత్తు. వరంగల్ జిల్లాలోని రిజర్వాయర్లు నింపు.. చెరువులు నింపు అని నేను ఇక్కడ ప్రెస్మీట్లో మాట్లాడినా.. వరంగల్ పోయి మాట్లాడినా.. మా పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా మాట్లాడారు. మా వరంగల్ జిల్లా నాయకులంతా మాట్లాడారు.. ఎత్తావా..? నువ్వు.. మరి ఆ రోజు నీళ్లు ఎందుకు ఎత్తలేదు.. చుక్క నీళ్లు రాగానే దేవాదులలో నీల్లు ఎత్తాలనే సోయి నీకు ఎందుకు లేదు. ఎల్నినో వస్తుందని…
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/telangana/if-you-ran-motors-how-drought-will-came-to-warangal-says-harish-ao-to-cm-revanth-reddy-2538658
framing not published · 70 outlets covered this story, below the floor for a split