Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
Harish Rao : రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణమని బీఆరెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గం పలుగు తండాకు చెందిన ఉద్యమకారులు, నిరుపేద రైతు కూలీలైన వాడిత్య యాదు నాయక్, పాపీ బాయి దంపతుల కుమార్తెలు వాడిత్య నివేదిత, వాడిత్య అఖిల ఇద్దరూ ఎంబీబీఎస్ సీట్లు సాధించి కుటుంబసమేతంగా వచ్చి తనను కలవడం ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందని చెప్పారు.
ఒకప్పుడు మెడిసిన్ చదవడమంటే కోట్ల రూపాయల ఫీజులు, డొనేషన్లు కట్టగలిగే సంపన్నులకే సాధ్యమనే భావన ఉండేదని, కానీ పేదరికం ప్రతిభకు అడ్డంకి కారాదనే బలమైన సంకల్పంతో కేసీఆర్ తెలంగాణవ్యాప్తంగా వందలాది గురుకులాలను ఏర్పాటు చేసి కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందించారని హరీష్రావు తెలిపారు. దానికితోడు జిల్లాకో మెడికల్ కాలేజీని నెలకొల్పి రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లను 2,850 నుంచి 10,000 పైచిలుకు పెంచడం నేడు క్షేత్రస్థాయిలో అద్భుత ఫలితాలను ఇస్తోందన్నారు.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/telangana/it-is-a-matter-of-pride-that-the-children-of-agricultural-laborers-are-becoming-doctors-former-minister-harish-rao-2539536
framing not published · 1 outlet covered this story, below the floor for a split