Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Namasthe Telangana · NT News telugu · 2 min read at Namasthe Telangana
Harish Rao | కేసీఆర్ ఎప్పుడో చెప్పారు.. కాంగ్రెసోళ్లు గెలిస్తే రైతు బంధుకు రాం రాం.. దళిత బంధుకు జై భీమ్.. అయిందా మరి ఇప్పుడు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. గద్వాల రైతుల సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. మూడు పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండు. రైతు బీమా బంద్ పెట్టిండు. 24 గంటల కరెంట్ 7 గంటలకు వచ్చేసింది.. కళ్యాణ లక్ష్మి పిల్లలు పుట్టినంక వస్తుంది.. కేసీఆర్ ఉన్నప్పుడు కల్యాణలక్ష్మి పెళ్లికి వచ్చింది.. రేవంత్ రెడ్డి వచ్చినంక పిల్లలు పుట్టిన తర్వాత వచ్చింది. తులం బంగారం ఇస్తమన్నరు.. ఉత్తదైపోయిందా.. లేదా..? అని ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి అన్నారు హరీశ్ రావు. ఇయ్యాళ్ల పాలమూరు బిడ్డ అని చెప్పుకునే అర్హత రేవంత్ రెడ్డికి లేదు. ఎందుకంటే నువ్వు పాలమూరు ఎత్తిపోతలను పండబెట్టినవ్.. నీళ్లు ఇయ్యలేదు. మళ్లీ పాలమూరు జిల్లాలో వలసలు మొదలైనయి. ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలకు వచ్చే మాట ఒక్కటే. నిరంజనన్న మీకు అండగా ఉన్నరు.. హనుమంతు అద్భుతంగా పనిచేస్తున్నడు. కేశవ్ ఉండనే ఉన్నారు.. అలంపూర్ ఎమ్మెల్యే మీ పక్కనే ఉన్నారు. ఏ ఆపద వచ్చినా మీకు ఎమ్మెల్యే తయారుగా ఉండనే ఉన్నడు. ఒక్క ఏడాది ఏడాదిన్నర కష్టపడండి. మీ అందరినీ కాపాడుకునే బాధ్యత మాది. ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా మేమంతా మీకు అండగా ఉంటాం. మిమ్మల్నందరినీ కాపాడుకునే…
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/mahabubnagar/cm-revanth-reddy-is-palamuru-enemy-says-harish-rao-2536516
framing not published · 1 outlet covered this story, below the floor for a split