ఇద్దరు రైతుల ఆత్మహత్య.. సాగునీళ్లు లేక ఎండుతున్న పంటలు
Namasthe Telangana · NT News telugu · 2 min read at Namasthe Telangana
శంకరపట్నం/జైనథ్, అక్టోబర్ 19 : సాగునీరందించడంలో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం.. అన్నదాతలకు శాపంలా మారుతున్నది. సరైన వర్షాలు లేక ఓవైపు.. కరెంట్ కోతలతో నీళ్లందక మరోవైపు పంటలు ఎండుముఖం పట్టాయి. కండ్ల ముందే పంటలు దెబ్బతింటుండటంతో చూసి తట్టుకోలేక ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటనలు కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో సోమవారం చోటుచేసుకున్నాయి. బాధిత రైతుల కుటుంబాల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కరీంపేటలో చెందిన నాంపెల్లి సాంబయ్య (55) తనకున్న రెండున్నర ఎకరాలతోపాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని, వరి సాగు చేశాడు. రూ.1.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. ఈ సారి కాకతీయ…
ఆదివారం బతుకమ్మ పండుగ కావడంతో ఇంట్లో బతుకమ్మ పేర్చి బయటకు వెళ్లాడు. సాయంత్రం భార్య శోభ, కొడుకులు అజయ్, శ్రావణ్ గ్రామంలోని బతుకమ్మ వేడుకలకు వెళ్లి, రాత్రి ఇంటికి చేరుకున్నారు. రాత్రి 10.35 గంటల ప్రాంతంలో సాంబయ్య మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఎందుకు తాగావని అడిగితే.. పొలానికి నీళ్లు పారడం లేదని, ఆ బాధతోనే తాగానని చెప్పాడు. ఈ క్రమంలో భార్యతో గొడవపడి బయటకు వెళ్లిపోయాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుమారుడు అజయ్ పరిసరాల్లో వెతికాడు. రాత్రి 11:45 గంటల సమయంలో తన వ్యవసాయ పొలానికి సమీపంలో ఉన్న వాగు వద్ద చెట్టుకు లుంగీతో ఉరివేసుకొని విగత జీవిగా కన్పించాడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు…
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/telangana/farmer-dies-by-suicide-in-karimnagar-over-lack-of-irrigation-water-2540580
framing not published · 1 outlet covered this story, below the floor for a split