ఇసుక రాయల్టీతో రూ.1,200 కోట్ల ఆమ్దానీ..రాష్ట్రంలో ఇసుక మాఫియాకు చెక్ పెట్టినం : మంత్రి వివేక్ వెంకటస్వామి
V6 Velugu · V6 Velugu · 2 min read at V6 Velugu
కోల్బెల్ట్/ కోటపల్లి, వెలుగు: రాష్ట్రంలో ఇసుక మాఫియాను కట్టడి చేశామని, ఈ ఏడాది రాయల్టీ ద్వారా ప్రభుత్వానికి రూ.1200 కోట్ల ఆదాయాన్ని తీసుకవస్తామని రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. సామాన్య ప్రజలకు తక్కువ ధరకు ఇసుక అందించడంతోపాటు సర్కార్కు ఎక్కువ ఆమ్దానీ రాబట్టేలా పనిచేస్తున్నట్లు చెప్పారు. సోమవారం మంచిర్యాల జిల్లా చెన్నూరులో మంత్రి వివేక్ వెంకటస్వామి, -సరోజ దంపతులు పర్యటించారు. రోడ్డు విస్తరణలో షాప్లు కోల్పోయిన చిరువ్యాపారుల కోసం 15వ వార్డులో రూ.కోటి డీఎంఎఫ్టీ నిధులతో నిర్మించనున్న షాపింగ్ కాంప్లెక్స్పనులకు మున్సిపల్చైర్పర్సన్ పెద్దింటి పద్మ, వైస్…
అనంతరం ఆలయ చైర్మన్సతీశ్, పాలకవర్గ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి వివేక్ మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో రూ.700 కోట్లకు మాత్రమే పరిమితమైన ఇసుక రాబడిలో రూ.300 కోట్లను బీఆర్ఎస్ లీడర్లు మింగారని, రాష్ట్ర ఖజానాకు నష్టం చేశారన్నారు. తాను మైనింగ్మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇసుక ద్వారా వచ్చే ఆదాయాన్ని రూ.700 కోట్ల నుంచి రూ.1,000 కోట్లకు పెంచామని చెప్పారు. ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే ఇసుక రాయల్టీ ద్వారా రూ.600 కోట్ల ఆదాయాన్ని తీసుకవచ్చామని, ఈ ఏడాది మొత్తం రూ.1,200 కోట్ల ఆమ్దానీ తీసుకవస్తామన్నారు. కార్మిక శాఖలో రూ.150 కోట్ల కుంభకోణం జరిగిదంటూ తప్పుడు ప్రచారం…
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/-minister-vivek-venkataswamy-rs-1200-cr-revenue-from-sand-royalties-as-mafia-controlled-
framing not published · 1 outlet covered this story, below the floor for a split