Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
Jagadish Reddy | విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముస్లిం, క్రైస్తవ సోదరులకు సామూహిక విందు ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ మతాలకు చెందిన ప్రతినిధులు, మత పెద్దలు పాల్గొన్నారు. జగదీష్ రెడ్డి వారిని ఆత్మీయంగా ఆహ్వానించి, వారితో కలిసి విందులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. సర్వమతాల సారాంశం మానవత్వమేనని అన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలోనే ప్రజల మధ్య ఐక్యతను చాటిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని మతాల ప్రధాన పండుగలకు ప్రత్యేక నిధులు కేటాయించారని తెలిపారు. క్రిస్మస్ ప్రేమవిందు, రంజాన్ ఇఫ్తార్ విందు, తోఫా, దుస్తుల పంపిణీ వంటి కార్యక్రమాలు అన్ని మతాల పట్ల కేసీఆర్కు ఉన్న గౌరవానికి నిదర్శనమని పేర్కొన్నారు.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/telangana/jagadish-reddy-hosts-a-dussehra-feast-for-muslim-and-christian-communities-in-suryapet-2540826
framing not published · 1 outlet covered this story, below the floor for a split