జై కొట్టిన సింగరేణి
Namasthe Telangana · NT News telugu · 5 min read at Namasthe Telangana
కరీంనగర్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/పెద్దపల్లి (నమస్తే తెలంగాణ): గులాబీ జెండాకు సింగరేణి జైకొట్టింది. నల్లనేలపై కార్మికలోకం గర్జించింది. కోల్బెల్ట్ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చింది. దీంతో ఎటుచూసినా జాతరను తరలిపించింది. ఒక్కమాటలో చెప్పాలంటే నల్లనేలపై బుధవారం సమరభేరి మోగింది. సింగరేణి భద్రత, కార్మికుల భవిష్యత్తు కోసం బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నిర్వహించిన ‘సింగరేణి కార్మిక గర్జన’ విజయవంతమైంది. కాంగ్రెస్ ప్రలోభాలకు తలొగ్గకుండా భారీగా తరలివచ్చిన కార్మికలోకం అభిమానం చాటుకున్నది. వేలాది మందితో గోదావరిఖనిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం పోటెత్తింది.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో సింహగర్జన చేసింది. మూడేండ్ల కాంగ్రెస్ పాలనలో సింగరేణి కుంభకోణాలమయంగా మారడం, కార్మికుల ప్రయోజనాల విస్మరింపు, హామీలు అమలుకు నోచుకోకపోవడం వంటి సమస్యలను కేటీఆర్ కార్మికుల కండ్ల ముందుంచారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో సింగరేణిని లాభాల బాట పట్టించడం, కార్మిక సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడం, కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించడం, లాభాలా వాటా పెంచడం.. ఇలా అన్ని రకాలుగా ప్రోత్సహించిన తీరును కేటీఆర్ వివరించగా, కార్మికలోకం గుర్తు చేసుకున్నది. సింగరేణిని నిర్యీర్యం చేసిన కాంగ్రెస్ను వదిలిపెట్టేది లేదని, కచ్చితంగా బుద్ధి చెప్తామని…
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/telangana/ktr-leads-massive-singareni-workers-rally-in-godavarikhani-2536776
framing not published · 1 outlet covered this story, below the floor for a split