Japan | జపాన్లో సాయంత్రం సమయంలో ఆహార పదార్థాలపై రాయితీ.. ఎందుకో తెలుసా..?
Namasthe Telangana · NT News telugu · 2 min read at Namasthe Telangana
Japan | జపాన్ పర్యటనకు వెళ్లే పర్యాటకులు ఆహారం కోసం చేసే ఖర్చును భారీగా తగ్గించుకోవచ్చని ఓ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ వెల్లడించారు. అక్కడి సూపర్మార్కెట్లు, కన్వీనియన్స్ స్టోర్లలో సాయంత్రం వేళ తాజా ఆహార పదార్థాలపై భారీ రాయితీలు లభిస్తాయని తెలిపారు. సరైన సమయంలో కొనుగోలు చేస్తే కొన్ని పదార్థాలను 80 శాతం వరకు తక్కువ ధరకు పొందవచ్చని వివరించారు. జపాన్లో తాజా కూరగాయలు, చేపలతో తయారుచేసే ఆహారానికి ప్రాధాన్యం ఉండగా, ఈ పద్ధతి పర్యాటకులకు బాగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
స్వాతి, ప్రదీప్ అనే ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ల జంట జపాన్లోని ఓ సూపర్మార్కెట్ను సాయంత్రం వేళ సందర్శించి తమ అనుభవాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మూడు రోజుల పాటు సరిపడే తాజా ఆహార పదార్థాల కోసం కేవలం రూ.1,400 మాత్రమే ఖర్చు చేసినట్లు వారు వెల్లడించారు. సాయంత్రం సమయంలో కొన్ని ఉత్పత్తుల ధరలు ప్రతి 20 నిమిషాలకు తగ్గుతాయని స్వాతి వివరించారు. దుకాణం మూసే సమయం దగ్గరపడే కొద్దీ మరింత రాయితీ లభిస్తుందనే ఆశతో వినియోగదారులు అక్కడ బారులు తీరుతారని తెలిపారు.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/health/tourists-who-visit-japan-must-know-that-they-can-get-foods-at-discounted-prices-in-the-evening-2538539
framing not published · 1 outlet covered this story, below the floor for a split