Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Namasthe Telangana · NT News telugu · 2 min read at Namasthe Telangana
Jio IPO | భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు! రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ (జేపీఎల్) పబ్లిక్ ఇష్యూకు అంతర్జాతీయ, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందన లభించింది. ఐపీఓకు ముందు నిర్వహించిన యాంకర్ బుక్‌లో సుమారు రూ.2.5 లక్షల కోట్ల విలువైన బిడ్లు వచ్చినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. భారత క్యాపిటల్ మార్కెట్ చరిత్రలో ఒక ఐపీవో యాంకర్ బుక్కు ఈ స్థాయిలో డిమాండ్ రావడం ఇదే తొలిసారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
మొత్తం రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యంలో భాగంగా యాంకర్ బుక్ ద్వారా రూ.8,110 కోట్ల విలువైన షేర్లను కేటాయించేందుకు ఉంచగా.. వాటి కోసం వచ్చిన బిడ్లు అందుబాటులో ఉన్న మొత్తానికి 30 రెట్లకుపైగా ఉన్నట్లు సమాచారం. ఈ స్పందన జియో వ్యాపార వృద్ధిపై సంస్థాగత పెట్టుబడిదారులకు ఉన్న అంచనాలను ప్రతిబింబిస్తోందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. జియో యాంకర్ బుక్‌లో ప్రపంచంలోని ప్రముఖ పెట్టుబడి సంస్థలు పాల్గొన్నట్లు సమాచారం. బ్లాక్‌రాక్, క్యాపిటల్ గ్రూప్, ఫిడెలిటీ ఇన్వెస్ట్మెంట్స్, టీ. రో ప్రైస్, ష్రోడర్స్, జేపీ మోర్గాన్ అసెట్ మేనేజ్మెంట్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఇన్వెస్కో, జానస్ హెండర్సన్ వంటి…
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/business/mukesh-ambani-jio-platforms-ipo-gets-rs-2-5-lakh-crore-bids-in-anchor-book-2540215
framing not published · 1 outlet covered this story, below the floor for a split