జూరాల ఆయకట్టుకు నీళ్లియ్యండి
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
పెంట్లవెల్లి, అక్టోబర్ 19 : జూరాల చివరి ఆయకట్టు డీ-37 కాలువ ద్వారా రైతాంగానికి సాగునీరు అందించి ఎండుతున్న పంటలను కాపాడాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి సూచించారు. విద్యుత్తు కోతలు, నీటి సమస్య కారణంగా చివరి దశలో ఉన్న పంటలు చేతకందే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం గోప్లాపురం, శింగవరం గ్రామాల్లో ఎండిన పంటలను ఆయన రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడు వెళ్లబోసుకుంటూ కన్నీళ్లు పెట్టుకోవడంతో మాజీ ఎమ్మెల్యే బీరం సైతం భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పంటలు ఏపుగా పెరిగి దిగుబడి…
రైతాంగానికి సాగునీరు అందించలేని ఈ చేతగాని ప్రభుత్వం వల్లే అన్నదాతలు రోడ్డున పడాల్సిన దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గోపల్‌దిన్నె-సింగోటం లింక్ కెనాల్ పనులు ప్రారంభించామని, ఆ పనులు పూర్తయి ఉంటే రైతులకు సాగునీరు అందేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కీలకమైన సాగునీరు ప్రాజెక్టులను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు రైతుల సమష్యలను పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. వెంటనే గోపల్‌దిన్నె – సింగోటం లింక్ కెనాల్ పనులను పూర్తి చేసి సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంటలు…
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/telangana/beeram-harshavardhan-reddy-demands-irrigation-water-for-drying-crops-2540592
framing not published · 1 outlet covered this story, below the floor for a split