కాలరేఖపై కవిత్వమై నిల్చిన శతాబ్ది కవి!
Namasthe Telangana · NT News telugu · 4 min read at Namasthe Telangana
అంటారు మహాకవి శేషేంద్ర. ఆదికవి వాల్మీకి నుంచి ఆధునిక కవి వరకు, మన తొలికవి నన్నయ్య నుంచి నవకవి వరకు కవులు దేశ సాహిత్య, సాంస్కృతిక వైభవానికి సారథులు. అక్షరానికి ఆయువు పోసి, కావ్యకళ ద్వారా అమరం చేసిన అనితర సాధ్యులు. నదులు దేశాన్ని సాగు చేస్తే, కవులు సమాజాన్ని సాగు చేస్తారు. నదులు పండించే పంటలు ఆకలి తీరిస్తే, కవులు పండించే కలం పంటలు అమృత తుల్యమైన అనుభూతిని ప్రసాదిస్తాయి. కవులు మానవజాతి రక్తకణాల మీద పనిచేసే అలంకారాల నిధులు. గంగ, యమున, గోదావరి వంటి నదులు భారతీయ సాంస్కృతిక కేంద్రాలైతే, వాల్మీకి, వ్యాస, కాళిదాసాదులు భారతీయ సాహిత్య వైభవానికి మూలస్థానాలు. కవులు కావ్యాలనే వసంతాల్ని నాటి పోతారు. అవి…
‘ఓ నా ప్రజలారా!రండి! మీకో పద్యం ఇస్తా! ఈ పద్యం మీకో కొత్త ప్రాణం ఇస్తుంది కొత్త ప్రయాణం ఇస్తుంది’-శేషేంద్ర కవిగా ప్రపంచానికి చేసిన ప్రమాణం ఇది. కవిత్వమే తన ప్రాణవాయువుగా సాగిన తన ప్రయాణంలో శేషేంద్ర ప్రజలకిచ్చిన నైతిక మద్దతు ఇది. కాలం ఏదైనా కవి తన కలాన్ని పదునెక్కించి కాలం వెంట నడవాలి! కాలరేఖపై కవిత్వ సంతకం చేయాలి. శేషేంద్రగా ప్రపంచానికి పరిచయమైన డా.గుంటూరు శేషేంద్ర శర్మ అనన్య సామాన్యమైన కవితా సృష్టితో ఈ శతాబ్దాన్ని వెలిగించారు. శతాబ్ది కవిగా, శబ్దమాంత్రికునిగా కీర్తి గడించారు.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/literature-more/seshendra-sharma-the-revolutionary-poet-who-transformed-modern-telugu-literature-2539726
framing not published · 1 outlet covered this story, below the floor for a split