కాంగ్రెస్ ఓటమి ఖాయం
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్రంలోని గ్రాడ్యుయేట్లు, విద్యావంతులు, నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, వచ్చే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి వారు బుద్ధి చెప్పడం ఖాయమని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. నిరుద్యోగులు, విద్యార్థులకు ఇచ్చిన హామీల్లో ఒకదాన్నీ అమలు చేయకుండా రేవంత్ సర్కార్ వారిని దారుణంగా మోసం చేసిందని విమర్శించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతోపాటు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అవసరమైన నోటిఫికేషన్లు వేయకుండా నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. వచ్చే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో విద్యావంతులు, నిరుద్యోగులు తమ ఓటు ద్వారా సమాధానం చెప్తారని హెచ్చరించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతపై తెలంగాణ భవన్లో శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులతో కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/telangana/ktr-says-congress-will-face-voters-anger-in-upcoming-graduate-mlc-elections-2538470
framing not published · 70 outlets covered this story, below the floor for a split