కార్మికుల జీతాలు పెంచాలి: మాజీ మంత్రి హరీశ్‌రావు
V6 Velugu · V6 Velugu · 1 min read at V6 Velugu
సిద్దిపేట రూరల్, వెలుగు: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా కార్మికులకు జీతం పెంచలేదని, మరోవైపు నిత్యావసరాల ధరలు, బస్సు ఛార్జీలు, విద్యుత్ బిల్లులు విపరీతంగా పెంచిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. సోమవారం సిద్దిపేట మున్సిపల్ ఆఫీస్‌లో పట్టణ పారిశుధ్య కార్మికులతో ఆత్మీయంగా ముచ్చటించి, వారితో కలిసి టిఫిన్ చేసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దసరా పండుగను పురస్కరించుకుని మహిళలు, పురుష కార్మికులకు బట్టలు అందజేసి, సన్మానించారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ సిద్దిపేట స్వచ్ఛత వెనుక పారిశుధ్య కార్మికుల కష్టమే ఉందన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వారి జీతాలు పెంచాలని, ఇతర విభాగాల కార్మికులకు కూడా గ్రూప్ విధానం అమలు చేయాలని అసెంబ్లీలో ప్రభుత్వంపై పోరాడుతామని తెలిపారు. గతంలో కాంగ్రెస్ హయాంలో రూ.8,300గా ఉన్న జీతాన్ని బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ రూ.16,600కు పెంచారని, మధ్యవర్తులు, కాంట్రాక్టర్లను తొలగించి కార్మికులకు నేరుగా జీతాలు అందేలా చేశామని పేర్కొన్నారు.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/former-minister-harish-rao-comments-on-wages-of-labour
framing not published · 1 outlet covered this story, below the floor for a split