కడియంలో ఘనంగా అన్నసమారాధన - Visalaandhra
Visalaandhra · Shanthi · 1 min read at Visalaandhra
విశాలాంధ్ర – కడియం : మండల కేంద్రమైన కడియం వెంకటసూర్య థియేటర్ సమీపంలో వేంచేసియున్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం వద్ద 27 వ గణపతి నవరాత్రుల ముగింపు సందర్భంగా తాడాల వీర వెంకట్రావు గురుస్వామి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా అన్నసమారాధన నిర్వహించారు. వివిధ రకాల ఆహార పదార్థాలతో ఏర్పాటు చేసిన ఈ అన్నసమారాధనకు సుమారుగా 15 వేల మంది భక్తులు హాజరై స్వామి వారిని దర్శించుకుని, అన్నప్రసాదాన్ని స్వీకరించారు. యువకులు, మహిళలు, భవాని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నసమారాధన ఏర్పాట్లలో తమ వంతు సేవలు అందించారు. దాతలు, భక్తులు, గ్రామస్తుల సహకారంతో నిర్వహించిన ఈ అన్న సమారాధన విజయవంతంగా ముగిసింది.…
Excerpt. Full story at Visalaandhra: https://visalaandhra.com/a-grand-meal-was-served-in-kadiyam
framing not published · 1 outlet covered this story, below the floor for a split