కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర కాఫర్ డ్యామ్ నిర్మించాలి.. ప్రభుత్వానికి కవిత డెడ్‌లైన్
V6 Velugu · V6 Velugu · 2 min read at V6 Velugu
కన్నెపల్లి: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకుని రైతులను ఆదుకోవాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి (లక్ష్మీ) పంప్‌హౌస్‌ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు ద్వారా నీటి వినియోగం, సాగునీటి సరఫరా, కరువు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజీలతో పాటు రిజర్వాయర్లు, కాలువలు ఉన్నాయని కవిత అన్నారు. కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద సుమారు రూ.25 కోట్ల వ్యయంతో కాఫర్ డ్యామ్ నిర్మిస్తే నెల నుంచి నెలన్నర రోజుల్లో పనులు పూర్తి చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ నిర్మాణం ద్వారా మేడిగడ్డ బ్యారేజీతో సంబంధం లేకుండా గోదావరి జలాలను వినియోగించుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/kavitha-demands-cofferdam-at-kannepalli-pump-house-gives-telangana-government-deadline-to-begin-work
framing not published · 2 outlets covered this story, below the floor for a split