కరోనా మాదిరిగానే ఎల్ నినోను ఎదుర్కొందాం : మంత్రి వివేక్
V6 Velugu · V6 Velugu · 2 min read at V6 Velugu
తొగుట/తూప్రాన్/నర్సాపూర్, వెలుగు: గతంలో అందరం ఒక్కటై కరోనాను ఎదుర్కొన్నట్లే.. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతో ఎల్ నినోను ఎదుర్కొందామని రాష్ట్ర శక్తి, గనుల శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా అక్బర్ పేట–భూంపల్లిలో దుబ్బాక, భూంపల్లి–-అక్బర్పేట, మిరుదొడ్డి, రాయపోల్, దౌల్తాబాద్, తొగుట మండలాలకు చెందిన 2,111 మంది డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. 179 మంది కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు రూ.1.79 కోట్ల విలువైన చెక్కులను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి…
ఎల్‌నినో నేపథ్యంలో వచ్చే జూన్ వరకు వర్షం పడే అవకాశం లేనందున రైతులు వరి వేయొద్దని, ఆరుతడి పంటలు, కూరగాయలు సాగు చేసుకోవాలని చెప్పారు. సిద్దిపేట జిల్లాలో ఇప్పటికే 12 వేల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, మరో 3 వేల ఇళ్లను కేటాయిస్తున్నట్లు చెప్పారు. గృహజ్యోతి, సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలతో పేదలకు ప్రయోజనం కలుగుతోందన్నారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రజలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశామని, త్వరలో కొత్త పింఛన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సిద్దిపేట కలెక్టర్ హైమావతి, రాష్ట్ర పద్మశాలీ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్ పాల్గొన్నారు.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/minister-vivek-venkataswamy-said-farmers-should-opt-for-less-water-intensive-crops-amid-el-ni%C3%B1o-concerns
framing not published · 2 outlets covered this story, below the floor for a split