Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
Namasthe Telangana · NT News telugu · 2 min read at Namasthe Telangana
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారి ప్రతినిధిగా కేట్ జచారియా కేవలం అయిదో రోజు పని చేశారు. వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ బాధ్యతలను ఆమె వదులుకున్నారు. మాజీ ప్రెస్ సెక్రటరీ కరోలినా లివియేట్ ఆగస్టులో తప్పుకున్న తర్వాత.. ఈ మధ్యలోనే ఆ పోస్టులో కేట్ జచారియా చేరారు. కానీ ఆమె ప్రెస్ బ్రీఫింగ్ సరిగా హ్యాండిల్ చేయలేదు. ఇక ఆమె చదువుకున్న డిగ్రీ అంశంలోనూ వివాదం చెలరేగింది. దీంతో అధ్యక్షుడు ట్రంప్ ఆమెను పరోక్షంగా సాగనంపారు. 42 ఏళ్ల కేట్ జచారియా కొన్ని రోజుల క్రితం వైట్‌హౌజ్‌లో మీడియా ప్రతినిధిగా చేరారు. అమెరికా అధ్యక్షుడి తరపున ప్రతి రోజూ ఆమె దేశ…
తొలి బ్రీఫింగ్లోనూ ఆమె మీడియా ప్రశ్నలను సరైన రీతిలో ఎదుర్కొలేకపోయారు. దీంతో ఆమెను సాగనంపుతూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. కానీ అయిదు రోజుల పాటు ప్రెస్ సెక్రటరీగా పనిచేయడం గౌరవంగా భావిస్తున్నట్లు కేట్ తన ఎక్స్‌లో తెలిపారు. ట్రంప్ చాలా మృదుస్వభావి అని, అద్భుతమైన వ్యక్తి అని, అమెరికన్లు ఆయన్ను ప్రశంసిస్తారని ఆశిస్తున్నట్లు ఆమె తన వీడ్కోల సందేశంలో పేర్కొన్నారు. కేట్తో మీడియా ప్రవర్తించిన సరిగా లేదని, దీంతో ఆమె తన మైండ్ మార్చుకున్నదని ట్రంప్ చెప్పారు.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/international/worked-only-for-5-days-katie-zacharia-confirmed-her-exit-as-white-house-press-secretary-2538603
framing not published · 3 outlets covered this story, below the floor for a split