KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
KCR : తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ ముగింపు వేడుకలైన సద్దుల బతుకమ్మ ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శనివారం శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డల ఆటపాటలతో సాగిన బతుకమ్మ సంబురాలతో తెలంగాణ వ్యాప్తంగా సందడి నెలకొందన్నారు.
‘మల్లారావమ్మా బతుకమ్మా.. మా బతుకులు బాగు చేయవమ్మా’ అని కోరుకుంటూ బతుకమ్మకు వీడ్కోలు పలుకుతూ ఘనమైన తెలంగాణ సాంస్కృతిక వేడుకలను ఆడబిడ్డలు ముగిస్తారని కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర సాధనలో, తెలంగాణ ప్రగతిలో మహిళల భాగస్వామ్యం మహోన్నతమైనదని, వారి కృషిని త్యాగాలను గుర్తించిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారి సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేసిందని గుర్తు చేశారు.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/telangana/ex-cm-kcr-wishesh-telangana-women-on-the-ocassion-of-bathukamma-festival-2538904
framing not published · 14 outlets covered this story, below the floor for a split