కీసరలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు.. చిన్న పిల్లలకు కూడా మద్యం అమ్ముతున్నారు..
V6 Velugu · V6 Velugu · 1 min read at V6 Velugu
మన దేశంలో 21 ఏళ్ళు లోపువారికి మద్యం అమ్మకూడదు అనే రూల్ ఉన్న సంగతి తెలిసిందే. వైన్ షాపులు, బార్లలో ఈమేరకు బోర్డులు కూడా చూస్తూనే ఉంటాం. అలాంటిది కీసరలో చిన్న పిల్లలకు కూడా యథేచ్ఛగా మద్యం అమ్ముతున్నారు. అది కూడా వైన్ షాపులో కాదు, బెల్ట్ షాపులో... చిన్నపిల్లలకు మద్యం అమ్ముతున్నారు. మేడ్చల్ జిల్లా కీసరలో విచ్చల విడిగా బెల్ట్ షాప్స్ ఉదయమే చిన్న పిల్లలకు మద్యం అమ్ముతున్న బెల్ట్ షాప్స్ యజమానులు.
స్కూల్ కి వెళ్ళే సమయంలో బెల్ట్ షాప్స్ ముందు చిన్నారులు.ఉదయం కీసరలో బెల్ట్ షాప్ వద్ద తన తండ్రి కోసం మద్యం కొనుగోలు చేసుకొని వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.కనీసం చిన్నారులకు మద్యం విక్రయించొద్దు అని కూడా బెల్ట్ షాప్ యజమానికి అవగాహన లేదు అంటే ఎట్లా అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/keesara-belt-shops-selling-alcohol-to-children-
framing not published · 1 outlet covered this story, below the floor for a split