కేసీఆర్ ఫాంహౌస్ కు మళ్లిన కొండ పోచమ్మ! ఎత్తిపోతల కోసం కొత్తగా పుట్టిన 58 ఎకరాల చెరువు
V6 Velugu · V6 Velugu · 6 min read at V6 Velugu
హైదరాబాద్, వెలుగు: ‘కోటి ఆకాంక్షలతో తెచ్చుకున్న తెలంగాణలో బాగుపడిందెవరు?’ అనే చర్చ జరుగుతున్న టైంలో ఇటీవల కొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని వందల ఎకరాల్లో ఆయన, తన కుటుంబం నిర్మించుకున్న ఫాంహౌస్‌లో పెద్ద ఎత్తున ప్రభుత్వ, అసైన్డ్ భూములను కలిపేసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందులో నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సమగ్ర సర్వే చేయిస్తోంది. ఇదిలా ఉండగా కొండపోచమ్మ సాగర్ నుంచి కేసీఆర్ ఫాంహౌస్ కు వాటర్‌గ్రిడ్ తరహాలో నీళ్లను మళ్లిస్తున్న వ్యవహారం తాజాగా వెలుగు చూసింది. ఇందులో వాస్తవాలను…
2016 ముందు కేసీఆర్ ఫాంహౌస్‌కు ఎదురుగా చెరువే లేదు. గూగుల్‌లో నాటి, నేటి ఫొటోలు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. అప్పట్లో కొండపోచమ్మ సాగర్ తో పాటే సమాంతరంగా తన ఫాంహౌస్ ముందే ఈ చెరువును కేసీఆర్ తవ్వించుకున్నట్లు స్థానికులు చెప్తున్నారు. ఈ పాండురంగ చెరువు దాదాపు 58 ఎకరాల్లో విస్తరించింది. చెరువులు తవ్వడం మంచిదే. కానీ అది ఒక్కరి ప్రయోజనం కోసం కావడమే ఇక్కడ సమస్య. పాండురంగ చెరువు విషయంలోనూ అదే జరిగింది. చెరువు అవతలి గట్టున కనిపించే మోటార్లు, పైపులు దాని అసలు లక్ష్యమేంటో చెప్పకనే చెబుతున్నాయి.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/kcr-farmhouse-gets-access-to-kondapochamma-sagar-water-allegations-over-58-acre-pond-and-diversion-canals
framing not published · 4 outlets covered this story, below the floor for a split