కోల్కతా తొక్కిసలాటపై బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం.. హైకోర్టు జడ్జితో SIT విచారణ
V6 Velugu · V6 Velugu · 1 min read at V6 Velugu
కోల్కతా: ఉత్తర కోల్కతాలోని చోర్బాగన్ దుర్గా పూజా మండపం దగ్గర తొక్కిసలాట జరిగి 19 మంది మరణించిన ఘటనపై బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై సమగ్ర విచారణకు కలకత్తా హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేసింది. వెస్ట్ బెంగాల్ సీఎం సువేందు అధికారి ఆదివారం (అక్టోబర్ 18) మీడియాతో మాట్లాడుతూ.. చోర్బాగన్ దుర్గా పూజా మండపం దగ్గర జరిగిన తొక్కిసలాటపై విచారణకు సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కోల్కతా హైకోర్టు సిట్టింగ్ జడ్జి సిట్కు నేతృత్వం వహిస్తారని చెప్పారు. ఇందుకోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయనుందని…
ప్రమాద స్థలంలోని సీసీటీవీ ఫుటేజీని అధికారులు సేకరించారని.. జనసమూహ నియంత్రణలో నిర్లక్ష్యం వహించినట్లు తేలితే పూజా కమిటీ నిర్వాహకులు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, పోలీసు అధికారులైనా సరే ఎవరినీ విడిచిపెట్టేది లేదని తేల్చిచెప్పారు. బెంగాల్లో గత ప్రభుత్వ హయాంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని.. ప్రతిపక్షాలు ఈ ఘటనను రాజకీయం చేయడం మానుకోవాలని సూచించారు. దుర్గా దేవి మండపాల దగ్గర వీఐపీ ట్రీట్మెంట్ క్లోజ్ చేస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/bengal-cm-seeks-sit-probe-under-hc-judge
framing not published · 8 outlets covered this story, below the floor for a split