కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు మంటలు అంటుకుని పూర్తిగా కాలిపోయింది. మంగళవారం సాయంత్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న బీసీ హాస్టల్ సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి.
ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో గ్రామంలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాన్స్ఫార్మర్ దగ్ధం కావడానికి ఓవర్లోడ్ లేదా లో వోల్టేజీ కారణమై ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/medak/power-transformer-catches-fire-in-medak-district-kolcharam-electricity-supply-disrupted-2540817
framing not published · 1 outlet covered this story, below the floor for a split