Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
Namasthe Telangana · NT News telugu · 2 min read at Namasthe Telangana
Kolkata Stampede : పశ్చిమబెంగాల్ (West Bengal) రాజధాని కోల్కతా (Kolkata) లో జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనలో తీవ్రంగా గాయపడి స్థానిక అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఈ ఉదయం కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా (Amit Shah), పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి (West Bengal CM) సువేందు అధికారి (Su) పరామర్శించారు. బాధితులతో మాట్లాడి ఘటన ఎలా జరిగిందని ఆరా తీశారు. ఆందోళన చెందవద్దని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని వారికి భరోసా ఇచ్చారు. అదేవిధంగా ఘటనా ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కాగా శనివారం రాత్రి 7.40 గంటల సమయంలో పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలోని చోర్బగాన్ సర్బజనీన్ దుర్గా మండపంవద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో అక్కడికక్కడే 17 మంది మృతిచెందారు. మృతుల్లో 13 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. మరో 35 మంది గాయపడ్డారు. చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 19కి చేరింది. గాయపడిన వారంతా ప్రస్తుతం వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/national/kolkata-stampede-amit-shah-and-suvendu-adhikari-arrive-at-apollo-hospital-to-meet-those-injured-in-the-durga-puja-stampede-incident-2539342
framing not published · 4 outlets covered this story, below the floor for a split