కోతల సర్కార్‌తో కన్నీళ్లే దిక్కు!
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 16: కరెంట్ కోతలను నిరసిస్తూ శుక్రవారం రైతులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోళి శ్రీనివాస్‌రెడ్డి నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని అలంపల్లి శ్రీనివాస్ వరి పంటను పరిశీలించారు. హనుమకొండ జిల్లా పరకాల సబ్‌స్టేషన్‌ను మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి సందర్శించారు. వనపర్తి జిల్లా కేతేపల్లి సబ్‌స్టేషన్ ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేపట్టారు.
నల్లగొండ జిల్లా మర్రూర్ సబ్‌స్టేషన్ ఎదుట మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గంటపాటు ధర్నా నిర్వహించారు. మర్రూర్, మోదినిగూడెం గ్రామ శివారుల్లో ఎండిన పంటపొలాలను పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో పంటపొలాలను బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. పొలాల్లో ద్విచక్ర వాహనాలు నడిపి సర్కార్‌పై నిరసన తెలిపారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రైతుల సంక్షేమానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/telangana/telangana-farmers-protest-power-cuts-as-drying-crops-trigger-anger-across-districts-2538453
framing not published · 70 outlets covered this story, below the floor for a split