KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
KTR | తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి ప్రతీక అయిన సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.
పూలతో పూజించడమే కాకుండా, పూలనే దేవతగా కొలిచే విభిన్నమైన, అత్యంత విశిష్టమైన సంస్కృతి మన తెలంగాణ సొంతమని కేటీఆర్ కొనియాడారు. రకరకాల తీరొక్క పూలను అందంగా పేర్చి, భక్తిశ్రద్ధలతో, ఆటపాటలతో తెలంగాణ ఆడబిడ్డలు తొమ్మిది రోజుల పాటు అత్యంత ఆనందోత్సాహాలతో ఈ పండుగను జరుపుకుంటారని ఆయన పేర్కొన్నారు. బతుకమ్మ వేడుకల్లో అత్యంత ప్రాముఖ్యమైన చివరి రోజైన ‘సద్దుల బతుకమ్మ’ సందర్భంగా… తెలంగాణ ప్రజలందరికీ ఆయన హృదయపూర్వక పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/telangana/ktr-extends-suddula-bathukamma-greetings-to-the-people-of-telangana-2539318
framing not published · 14 outlets covered this story, below the floor for a split