Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident )చోటు చేసుకుంది. భక్తులపైకి( Devotees) ట్రక్కు(truck) దూసుకెళ్లడంతో 12 మంది దుర్మరణం చెందారు. 39 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన గ్వాలియర్ జిల్లాలో శీతలా మాత ఆలయం వద్ద శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈప్రమాదంలో భక్తులు అక్కడికక్కడే మరణించారు. స్థానికులు, గ్వాలియర్ ఎస్పీ ధర్మవీర్ సింగ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలో చిన్నిర్ వైపు నుంచి వడ్ల లోడుతో వస్తున్న ఒక వస్తున్న భారీ ట్రక్కు అదుపు తప్పి భక్తులపైకి…
ఆ మార్గంలో భారీ వాహనాల ప్రవేశంపై నిషేధం ఉన్నప్పటికీ, లారీ అక్కడున్న పోలీస్ బారికేడ్లను, చెక్పోస్టును బద్దలుకొట్టుకుంటూ వేగంగా దూసుకొచ్చిందని స్థానికులు తెలిపారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న భక్తులను తొక్కుకుంటూ వెళ్లడమే కాకుండా, శీతలా మాత ఆలయ ప్రహరీ గోడను, ప్రధాన గేటును బలంగా ఢీకొట్టింది. దీంతో గోడ కూలి కొందరు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/national/12-people-killed-after-a-truck-runs-into-devotees-in-madhya-pradesh-2539280
framing not published · 81 outlets covered this story, below the floor for a split