మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పొడిగింపు
Prajasakti · 1 min read at Prajasakti
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో 2026–27 ఎక్సైజ్ పాలసీ ప్రకారం 807 ఏ4 మద్యం దుకాణాల కేటాయింపునకు దరఖాస్తుల స్వీకరణ గడువును ప్రభుత్వం మరో మూడు రోజులు పొడిగించినట్లు ఎక్సైజ్ శాఖ కమిషనర్ చామకూరి శ్రీధర్ తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి ఉన్న వారికి అదనపు అవకాశం కల్పిస్తూ ఈ నెల 6 అర్ధరాత్రి 12 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఎక్సైజ్ శాఖ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 7న దరఖాస్తుల పరిశీలన చేపట్టి, అర్హత కలిగిన దుకాణాలకు 8న డ్రా ఆఫ్ లాట్స్ నిర్వహించి లైసెన్సులు కేటాయించ నున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా తాజా కేటాయింపుల కోసం గుర్తించిన 807 ఏ4 దుకాణాల్లో 799 ఓపెన్…
Excerpt. Full story at Prajasakti: https://prajasakti.com/te-IN/latest-news/state-latest-news/wf-1790874645745
framing not published · 1 outlet covered this story, below the floor for a split