‘మహా’ రైతుకు రూ.5 వేల తక్షణ కరువు సాయం
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : ఒకవైపు కరెంటు కోతలు, మరోవైపు సాగు, తాగు నీటికి కష్టాలు.. వెరసి తెలంగాణవ్యాప్తంగా రైతాంగం, ప్రజలు అరిగోస పడుతున్నారు. ఎల్ నినోను ఎదుర్కోవడానికి ముందస్తు కార్యాచరణను సిద్ధం చేయడంలో రేవంత్ ప్రభుత్వం చేతులెత్తేయడంతో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ, రేవంత్ ప్రభుత్వం అన్నదాతలను ఆదుకొన్న పాపానపోలేదు. అయితే, పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో ఎల్నినోతో పంటలను కోల్పోయిన రైతులకు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం రూ. 5 వేల తక్షణ కరువు సాయాన్ని అందిస్తున్నది.
ఎల్నినో ప్రభావంతో మహారాష్ట్రవ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. రాష్ట్రంలోని 358 తాలూకాల్లో 305 తాలూకాలను కరువుపీడిత ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. రానున్నది పండుగల సీజన్. ఈ నేపథ్యంలో రైతులు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రాథమికంగా ఒక్కో రైతుకు రూ. 5 వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. దీపావళికి ముందే రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేయనున్నట్టు వెల్లడించింది. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం పంట కోల్పోయిన రైతులను ఆర్థికంగా ఆదుకొనే చర్యలు చేపట్టకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/national/telangana-farmers-reel-under-power-cuts-and-water-shortages-amid-el-nino-concerns-2538217
framing not published · 70 outlets covered this story, below the floor for a split