మన రైళ్లలో ఫుడ్ క్వాలిటీపై గుడ్ న్యూస్.. ఇకపై మరింత బెటర్‌గా ఉండే ఛాన్స్..!
V6 Velugu · V6 Velugu · 1 min read at V6 Velugu
మన రైళ్లలో టీ,కాఫీ, బ్రేక్ ఫాస్ట్, మీల్స్, అండా బిర్యానీ, చికెన్ బిర్యానీలపై ప్రయాణికులలో ఎలాంటి అభిప్రాయం ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అపరిచితుడు సినిమాలో హీరో రైలులో ప్రయాణించిన సందర్భంలో అతనికి కలిగిన అసహనం వంద మంది రైలు ప్రయాణికుల్లో 90 మందికి కలగక మానదు. కానీ.. మనం ఏం మార్చగలంలే అని సర్దుకుపోవడం వల్లే ఇండియన్ రైల్వేస్‌లో ఫుడ్ క్వాలిటీలో అప్పటికీ, ఇప్పటికీ పెద్ద తేడా ఏం లేదు. అయితే.. ఇకపై రైళ్లలో ఫుడ్ క్వాలిటీని వీలైనంత మెరుగుపరచాలని IRCTC నిర్ణయించింది.
భారతీయ రైల్వేలో ఆహార భద్రత, పరిశుభ్రత పద్ధతులలో అత్యున్నత ప్రమాణాలను పాటించేలా చూసేందుకు, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC), క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (QCI) ఒప్పందం (MoU)పై సంతకాలు చేశాయి. IRCTC ఆధ్వర్యంలో నడిచే అన్ని మొబైల్, స్టాటిక్ క్యాటరింగ్ యూనిట్లు ఆహార భద్రత, పరిశుభ్రతలో అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్నాయని నిర్ధారించడానికి ఒక థర్డ్-పార్టీ ఆడిట్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ ఆడిట్ యంత్రాంగం సాంకేతికత ఆధారితంగా, స్వతంత్రంగా ఉంటుంది.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/irctc-and-qci-signed-an-mou-to-ensure-high-food-safety-standards-in-indian-railways
framing not published · 1 outlet covered this story, below the floor for a split