MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
MBBS Student | ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్‌లోని బెగరాజ్పూర్ మెడికల్ కళాశాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న 24 ఏళ్ల విద్యార్థిని శగున్ సైనీ సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. కళాశాల హాస్టల్లోని గదిలో ఆమె మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో కంగారుపడిన తోటి విద్యార్థులు, సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ముజఫర్‌నగర్ జిల్లా మన్సూర్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బెగరాజ్పూర్ మెడికల్ కళాశాల హాస్టల్లో ఈ ఘటన జరిగింది. శగున్ గది తలుపు లోపలి నుంచి మూసి ఉండటంతో పాటు ఎంత పిలిచినా డోర్ తీయకపోవడంతో తోటి విద్యార్థులు, భద్రతా సిబ్బందికి అనుమానం వచ్చింది. వెనుకవైపు కిటికీలో నుంచి చూడగా ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గది తలుపును తెరిచి మృతదేహాన్ని కిందకు దించి, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీంతో…
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/national/mbbs-final-year-student-dies-by-suicide-in-muzaffarnagar-medical-college-hostel-2540898
framing not published · 1 outlet covered this story, below the floor for a split