మెడికల్ కాలేజీల్లో సమస్యల తాండవం
Namasthe Telangana · NT News telugu · 2 min read at Namasthe Telangana
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సమస్యలు తాండవిస్తున్నాయి. దీంతో వైద్య విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని వైద్య విద్యార్థులు ప్రభుత్వానికి వరుసగా ఫిర్యాదులు చేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. రాష్ట్రంలోని ములుగు, ఖమ్మం, కామారెడ్డి, మహేశ్వరం, ఆసిఫాబాద్, నర్సంపేట, నారాయణ్ పేట, జనగామ, మెదక్, కుత్బుల్లాపూర్‌లో మౌలిక వసతులు సరిగా లేక పోవడంతో మెడికల్ స్టూడెంట్స్‌కు ఇక్కట్లు తప్పడం లేదు. కామారెడ్డి మెడికల్ కాలేజీకి పర్మినెంట్ బిల్డింగ్ లేకపోవడంతో కళాశాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. నాలుగు…
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నా.. ప్రభుత్వ మెడికల్ కాలేజీని పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. పూర్తిస్థాయి కాలేజీ భవన నిర్మాణంలో జాప్యం.. ఆ కళాశాల ఎప్పటి వరకూ పూర్తవుతుందనే స్పష్టత కరువవడంతో వైద్య విద్య గాల్లో దీపంలా మారింది. తాత్కాలిక హాస్టల్ కొనసాగుతున్న భవనంలో మౌలిక వసతులు లేకపోవడం, కాలేజీలో కేవలం మూడు తరగతి గదులు ఉండగా.. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు కనీసం క్లాస్రూమ్ లేని పరిస్థితి నెలకొన్నది. ఈ కాలేజీకి బస్సు సౌకర్యం, సెంట్రల్ లైబ్రరీలో వసతులు సరిగా లేవని విద్యార్థులు చెప్తున్నారు. ఔట్‌పేషెంట్ (ఓపీ) విభాగానికి వచ్చే రోగుల సంఖ్యకు తగ్గట్టు గదులు…
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/telangana/government-medical-colleges-in-telangana-struggle-with-poor-infrastructure-2539885
framing not published · 1 outlet covered this story, below the floor for a split