మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్ కేసులో సంచలన తీర్పు: ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాలకు మరణశిక్ష
V6 Velugu · V6 Velugu · 2 min read at V6 Velugu
లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్ కేసులో మీరట్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సౌరభ్ రాజ్‌పుత్‌ను అత్యంత కిరాతకంగా హతమార్చిన కేసులో అతడి భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాలకు మీరట్ జిల్లా కోర్టు మరణశిక్ష విధించింది. 126 కోర్టు విచారణలు, 22 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత మీరట్ జిల్లా జడ్జి అరవింద్ కుమార్ మిశ్రా బుధవారం (అక్టోబర్ 14) ఈ తీర్పును వెలువరించారు. 2025 జూలైలో ప్రారంభమైన ఈ కేసు విచారణ దాదాపు 13 నెలల పాటు సాగింది. ప్రస్తుతం నిందితులు ఇద్దరు మీరట్‌లోని చౌదరి చరణ్ సింగ్…
మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్‌పుత్‌ను అతడి భార్య ముస్కాన్ ఆమె ప్రియుడితో కలిసి హత్య చేసిన ఘటన 2025, మార్చిలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సౌరభ్ డెడ్ బాడీని 15 ముక్కలుగా నరికి.. ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి సిమెంట్‌తో సీల్ చేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ మీరట్‌లో జరిగింది.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/death-penalty-for-muskan-boyfriend-sahil-shukla-in-infamous-meerut-blue-drum-murder-case
framing not published · 1 outlet covered this story, below the floor for a split