మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
Namasthe Telangana · NT News telugu · 4 min read at Namasthe Telangana
మహబూబ్‌నగర్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కృష్ణా నదికి వరద వచ్చినప్పుడు చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. బీఆర్ఎస్ నేతల అల్టిమేటమ్.. ఉమ్మడి జిల్లాలో పంటలు ఎండిపోతుండటంతో రైతుల ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందన్న భయంతో సర్కార్ ఎట్టకేలకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రెండు పంపులను ప్రారంభించింది. కొల్లాపూర్ మండలం నార్లాపూర్ పంప్‌హౌస్ వద్ద మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు రెండు మహాబహుబలి పంపులను ప్రారంభించారు. పంపింగ్ స్టేషన్లో నుంచి ఆన్ చేయగానే ఒక్కసారిగా నార్లాపూర్ రిజర్వాయర్ డెలివరీ సిస్టర్న్స్ నుంచి కృష్ణానది నీళ్ల జలధార ఉబికి…
కృష్ణానదికి నెలన్నర క్రితం భారీగా వరద వచ్చింది. జూరాల నుంచి సుమారు 275 టీఎంసీల వరకు శ్రీశైలానికి విడుదల చేశారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 285 టీఎంసీలు. నిండుకుండలా మారిన శ్రీశైలం జలాశయం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచ్చలవిడిగా జలదోపిడీకి పాల్పడటంతో ప్రస్తుతం 120 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉన్నది. వెలుగొండ పోతిరెడ్డిపాడు 1, 2, సుజల స్రవంతి ముచ్చుమర్రి హంద్రీనీవా తదితర పథకాల ద్వారా చంద్రబాబునాయుడు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఆదేశాలను తుంగలోకి తొక్కి విచ్చలవిడిగా జలదోపిడీకి పాల్పడ్డారు. ఇక్కడి నుంచి సుమారు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పం నియోజకవర్గానికి నీళ్లు తరలించారంటే ఏపీ…
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/telangana/palamuru-rangareddy-project-pumps-shut-down-after-just-three-hours-2536826
framing not published · 1 outlet covered this story, below the floor for a split