Mukesh Ambani- Jamnagar: జామ్‌నగర్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనింగ్ హబ్‌గా ముకేశ్ ఎలా మార్చారు?
Eenadu · Eenadu · 2 min read at Eenadu
Mukesh Ambani- Jamnagar | జామ్‌నగర్: ధీరూభాయ్ అంబానీ సగటు భారతీయులను షేర్‌హోల్డర్లుగా మారిస్తే.. ఆయన తనయుడు జామ్‌నగర్ రూపంలో ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనింగ్ హబ్‌ను తీర్చిదిద్దారు. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూనే దాన్ని మరిన్ని రెట్లు పెంచారు. 1977 నుంచి రిలయన్స్ షేర్లు కలిగిన కుటుంబాలకు 2006లో రిలయన్స్ పెట్రోలియం రూపంలో మరో పబ్లిక్ ఇష్యూ పలకరించింది. దీంతో సాధారణ మదుపర్లకు మరో పెద్ద రిలయన్స్ వ్యాపారంలో భాగస్వామి అయ్యే అవకాశం లభించింది. 2009లో అది రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో విలీనమైంది.
ఒక గొప్ప సంస్థను నిర్మించడం కష్టం. దానిని వారసత్వంగా పొంది, దాన్ని ఇంకా చాలా పెద్దది చేయడం వారసుడికి అసలైన పరీక్ష. 2002లో ధీరూభాయ్ అంబానీ కన్నుమూసే సమయానికి రిలయన్స్ అప్పటికే భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన వ్యాపార సామ్రాజ్యాల్లో ఒకటి. ధీరూభాయ్ అంబానీ నిర్మించిన వ్యాపారాన్ని వారుసుడిగా ముకేశ్ కాపాడుకుంటాడని అందరూ భావించారు. కానీ, ముకేశ్ అంబానీ మాత్రం అతిపెద్ద లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూనే, డిమాండ్‌ను ముందే ఊహించి పెట్టుబడులు పెట్టడం, ఆ రంగాన్ని పూర్తిగా మార్చివేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
Excerpt. Full story at Eenadu: https://www.eenadu.net/telugu-news/business/how-mukesh-ambani-made-jamnagar-home-to-the-worlds-largest-refining-hub/0101/126186629
framing not published · 1 outlet covered this story, below the floor for a split