MVSR Dandiya Event | ‘ఇది హిందువుల ఈవెంట్.. నువ్వెందుకు వచ్చావ్?’.. ఎంవీఎస్ఆర్ కాలేజీలో ముస్లిం బౌన్సర్‌ను నిలదీసిన యువకులు!
Namasthe Telangana · NT News telugu · 2 min read at Namasthe Telangana
MVSR Dandiya Event | ‘ఇది హిందువుల కార్యక్రమం.. నువ్వెందుకు వచ్చావ్?’ అంటూ ఓ ముస్లిం బౌన్సర్‌ను కొందరు యువకులు నిలదీశారు. ఈవెంట్ నిర్వాహకులే తనను విధులకు పంపించారని చెబుతున్నా వినిపించుకోకుండా ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. హైదరాబాద్‌లోని నాదర్గుల్ ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన దాండియా వేడుక సందర్భంగా జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ దాండియా కార్యక్రమానికి నిర్వాహకులు భద్రత కోసం బౌన్సర్లను నియమించారు. వారిలో ఫరీద్ అనే ముస్లిం బౌన్సర్ కూడా ఉన్నారు. అయితే, కొందరు యువకులు ఆయనను మతం పేరుతో ప్రశ్నిస్తూ దురుసుగా మాట్లాడారు. ‘నీకు సోషల్ మీడియా ఉంది కదా.. హిందువుల పండుగలకు ముస్లిం బౌన్సర్లు రావొద్దని ప్రచారం జరుగుతోంది కదా.. మరి నువ్వెందుకు వచ్చావ్?’ అని ప్రశ్నించారు. వైరల్ అవుతున్న వీడియోలో ఆ మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఇలా ముస్లిం బౌన్సర్‌ను వేధించడమే కాకుండా.. తామేదో ఘనకార్యం చేసినట్లుగాగా వీడియో తీసి మరీ సోషల్‌మీడియాలో పోస్టు చేశారు.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/hyderabad/why-did-you-come-to-a-hindu-festival-muslim-bouncer-harassed-at-mvsr-college-dandiya-event-2540941
framing not published · 1 outlet covered this story, below the floor for a split