నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర కారు బీభత్సం.. యువకుడు మృతి
V6 Velugu · V6 Velugu · 1 min read at V6 Velugu
ఉప్పల్‌లో తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. 2026 అక్టోబర్ 20న నాగోల్ మెట్రో స్టేషన్ సమీపంలో కారు అదుపుతప్పి జలమండలి ప్రధాన పైపులైన్‌ను ఢీకొట్టింది. అత్యంత వేగంతో వచ్చిన కారు అదుపుతప్పి పైప్ లైన్ ఢీకొట్టడంతో కారు నడుపుతున్న యువకుడు మృతి చెందాడు.
మృతుడు హయత్‌నగర్‌కు చెందిన వినీత్ చౌదరి (24)గా గుర్తించారు. తెల్లవారుజామున 3:30 గంటలకు ప్రమాదం జరిగింది. అతివేగంతో ఢీకొట్టడంతో పైపులైన్ ధ్వంసం అయ్యి.. నీరు ఉవ్వెత్తున ఎగిసిపడింది. దీంతో ఉప్పల్ ప్రధాన రహదారి నీటితో జలమయమైంది. తాగునీరు భారీగా వృథా అయిపోయింది.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/-youth-died-as-speeding-car-crashes-into-drinking-water-pipeline-near-nagole-metro-station-in-hyderabad
framing not published · 1 outlet covered this story, below the floor for a split