నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాయే లక్ష్యం : టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
జూలూరుపాడు, అక్టోబర్ 16 : భవిష్యత్‌లో పెరగనున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్‌ను అందించేందుకు పటిష్టమైన ముందస్తు చర్యలు చేపట్టాలని టీజీ ఎన్పీడీసీఎల్ (TG NPDCL) సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు మండలం పడమటి నరసాపురం గ్రామ సమీపంలోని 400 కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని శుక్రవారం విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఉప కేంద్రంలోని విద్యుత్ సరఫరా వ్యవస్థ పనితీరు, సరఫరా సామర్థ్యంపై అధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాబోయే సీజన్లో విద్యుత్ లోడ్ భారీగా…
లోడ్ పెరిగినప్పుడు సాంకేతికంగా తలెత్తే సమస్యలను ముందుగానే అంచనా వేసి, వాటి పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. విపత్తులు లేదా అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతే, క్షణాల్లో దానిని పునరుద్ధరించేలా ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పూర్తి సమన్వయంతో పనిచేయాలని సీఎండీ దిశానిర్దేశం చేశారు. ఏ పరిస్థితుల్లోనైనా వినియోగదారులకు నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే సంస్థ ప్రథమ లక్ష్యంగా సిబ్బంది నిరంతరం శ్రమించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ జి. మహేందర్, కొత్తగూడెం డివిజనల్…
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/khammam/badradri-kothagudem/goal-is-to-provide-quality-uninterrupted-power-supply-2538143
framing not published · 1 outlet covered this story, below the floor for a split