నమ్మినోళ్లను నట్టేట ముంచే వ్యక్తి కేటీఆర్ ..సొంత మనుషులపై ఉడుకు నీళ్లు పోసే తత్వం: కవిత
V6 Velugu · V6 Velugu · 2 min read at V6 Velugu
హైదరాబాద్, వెలుగు: కేటీఆర్ నమ్ముకున్నోళ్లనే నట్టేట ముంచే రకమని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. విదేశీ బొగ్గు కొనుగోలు ఒప్పందాలపై విచారణ పేరుతో ప్రతిమ శ్రీనివాస్ రావుకు వ్యతిరేకంగా కేటీఆర్ లేఖ రాయడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఉద్యమకాలంలో టీఆర్ఎస్ పార్టీని ఆదుకున్న ఏకైక వ్యక్తి ప్రతిమ శ్రీనివాస్‌రావు అని, ఆయనకు వ్యతిరేకంగా రాసిన ఆ లేఖ కేటీఆర్క్యారెక్టర్కు ప్రతిరూపమని పేర్కొన్నారు. సాయం చేసిన వాళ్లను, కుల బంధువులను ఇబ్బంది పెట్టడం.. ఇంటి మనిషినైనా తననూ కిరాయి మనుషులతో తిట్టించే నైజం కేటీఆర్ ది అని మండిపడ్డారు.
తెలిసి చేసిండో లేదా తెలియక చేసిండో గానీ లేఖ రాయడం కేటీఆర్అజ్ఞానాన్ని తెలియజేస్తున్నదన్నారు. సొంత మనుషులపైనే ఉడుకు నీళ్లు పోసే వ్యక్తి కేటీఆర్ అని ఫైర్ అయ్యారు. శుక్రవారం ఆమె బంజారాహిల్స్‌లోని పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. సింగరేణిలో బీఆర్ఎస్ సభ పెట్టి బల ప్రదర్శన చేయడానికి ప్రయత్నించారే తప్ప కార్మికుల కష్టాలను కనీసం ప్రస్తావించలేదని కవిత ఆరోపించారు. తమ పోరాటాలతోనే ప్రభుత్వం దిగి వచ్చి సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహిస్తున్నదని గుర్తు చేశారు.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/-ktr-betrays-those-who-trust-him-kavitha-alleges-amid-political-row
framing not published · 3 outlets covered this story, below the floor for a split