నవరాత్రి ఉత్సవాల్లో వింత ఘటన.. మహిళ శరీరంపై మొలిచిన బార్లీ విత్తనాలు.. చూసేందుకు ఎగబడిన భక్తులు!
V6 Velugu · V6 Velugu · 2 min read at V6 Velugu
నవరాత్రి ఉత్సవాల్లో వింత ఘటన ఒకటి చోటుచేసుకుంది. మహిళ శరీరంపై బార్లీ విత్తనాలు (జవారే) మొలకెత్తడం స్థానికంగా సంభ్రమాశ్చర్యానికి గురిచేసింది. అమ్మ వారి కటాక్షంతోనే మొలకలు మొలిచాయని.. దీక్ష వెనుక ఉన్న రహస్యాన్ని చెప్పడంతో.. ఆ మహిళను చూసేందుకు వేల సంఖ్యలో భక్తులు బారులు తీరారు. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ జిల్లా మౌరానీపూర్ ప్రాంతంలోని బుఖారా గ్రామంలో జరిగింది ఈ ఘటన. గౌరైయా మాతా మందిరంలో శరీరంపై మొలకలు పెంచుకుని దీక్ష తీసుకుంది జానకీ దేవి అనే మహిళ. ఆనోట ఈ నోట ఈ విషయం ప్రచారం కావడంతో సదరు మహిళ దీక్ష చూసేందకు భక్తులు ఉవ్వెత్తున తరలివస్తున్నారు.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/-barley-sprouts-grow-on-womans-body-in-uttar-pradesh-
framing not published · 1 outlet covered this story, below the floor for a split