నేను దుర్గా మాతను రా.. ధర తగ్గిస్తావా లేదా.. బైక్ షోరూమ్‌లో మహిళ హల్ చల్
V6 Velugu · V6 Velugu · 2 min read at V6 Velugu
బైక్ షోరూమ్ లో మహిళ అమ్మవారిగా చెప్పుకుంటూ హల్ చల్ చేసిన వీడియో వైరల్ గా మారింది. భర్తతో పాటు షోరూమ్ కు వెళ్లిన మహిళ.. ఒక్కసారిగా పూనకం వచ్చి ఊగిపోయి అక్కడ ఉన్నవారిని భయాందోళనలకు గురిచేసింది. నేను దుర్గామాతను రా అంటూ రచ్చ రచ్చ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ గా సర్క్యులేట్ అవుతోంది.
దసరా పండుగ సందర్భంగా కొత్త బైక్ తీసుకోవాలని షోరూమ్ కు వెళ్లారు భార్యాభర్తలు. ఎంచుకున్న బైక్ ధర చెప్పగానే షాక్ తిన్నట్లుగా.. పూనకం వచ్చినట్లుగా మహిళ ఒక్కసారిగా ఊగిపోయింది. నేను మాతారాణిని రా.. దుర్గా మాతను. బైక్ ధర పది వేల రూపాయలు తగ్గిస్తావా లేదా అంటూ కేకలు పెడుతూ.. పూనకంతో ఊగుతూ రచ్చ రచ్చ చేసింది. దీంతో షోరూమ్ స్టాఫ్ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యింది.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/woman-creates-a-scene-at-bike-showroom-after-claiming-that-she-is-goddess-durga-
framing not published · 1 outlet covered this story, below the floor for a split