నిధులివ్వండి మహాప్రభో.. ఇరు రాష్ర్టాలకూ కేఆర్ఎంబీ వేడుకోలు
Namasthe Telangana · NT News telugu · 2 min read at Namasthe Telangana
హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : ‘బోర్డు నిర్వహణకు నిధులివ్వండి మహాప్రభో..’ అంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) మొరపెట్టుకుంటున్నది. ప్రస్తుతం వచ్చే నెల జీతాలకు సైతం నిధుల్లేవని మొత్తుకుంటున్నది. ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014’ ప్రకారం కేఆర్ఎంబీ నిర్వహణకు అవసరయ్యే బడ్జెట్‌ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు 50ః50 నిష్పత్తిలో భరించాల్సి ఉన్నది. బోర్డు సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనలు పెట్టి ఆ మేరకు ఆమోదం తీసుకోవడం పరిపాటి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.23 కోట్లు అవసరమని బోర్డు అంచనా వేసింది. ఈ మేరకు గత…
కృష్ణా జలాల వినియోగం, నీటి విడుదలకు సంబంధించిన లెక్కలను పక్కాగా సేకరించేందుకు గతంలోనే టెలిమెట్రీలను ఏర్పాటు చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంగీకారానికి వచ్చాయి. మొదటి విడతలో నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టుల పరిధిలో మొత్తంగా 18 చోట్ల టెలిమెట్రీలను ఏర్పాటు చేశారు. ఫేజ్-2 కింద మరో తొమ్మిది చోట్ల ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించారు. ఫేజ్-2 కింద శ్రీశైలం కుడి ప్రధాన కాలువ (పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ దిగువన 3 కిలోమీటర్ల వద్ద), కేసీ కెనాల్, నాగార్జునసాగర్ ఎడమ ప్రధాన కాలువ, కుడి ప్రధాన కాలువ, ప్రకాశం బరాజ్ తూర్పు ప్రధాన కాలువ, పశ్చిమ ప్రధాన కాలువ, పోలవరం కుడి కాలువ సంగమం, పాలేరు…
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/telangana/krishna-river-board-seeks-funds-from-telangana-and-andhra-pradesh-2537702
framing not published · 1 outlet covered this story, below the floor for a split