నిరంతర విద్యుత్తు ఏమైపాయె?
Namasthe Telangana · NT News telugu · 3 min read at Namasthe Telangana
రాష్ట్రంలో విద్యుత్తు కోతలు రైతులను కంటతడి పెట్టిస్తున్నాయి. వ్యవసాయానికి సరిపడా కరెంటు అందడం లేదు. రైతులు సబ్స్టేషన్ల వద్ద ఆందోళనలు చేస్తున్నారు.వర్షాభావ పరిస్థితులతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు విద్యుత్తు అంతరాయాలు అదనపు భారంగా మారుతున్నాయి. సెప్టెంబర్, అక్టోబర్లో పలు ప్రాంతాల్లో రైతులు నిరసనలకు దిగారు. ఈ పరిస్థితుల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా ఇప్పుడు ఏమైపోయిందన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతున్నది. ప్రభుత్వం చెప్తున్న విద్యుత్తు సరఫరా లెక్కలకు, రైతులు అనుభవిస్తున్న వాస్తవ పరిస్థితులకు మధ్య తేడా ఎందుకు కనిపిస్తున్నది? ఈ ప్రశ్నలకు ప్రభుత్వ…
రైతుల పొలాలకు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పటికే వర్షాలు సరిగా కురవకపోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. సరిపడా ఎరువులు దొరకక ఆందోళనలో చిక్కుకున్నారు. ఇటువంటి సమస్యలతో సతమతమవుతున్న నేపథ్యంలో విద్యుత్తు కోతలు మరో సంక్షోభాన్ని సృష్టించాయి. ఆ సంక్షోభంలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. కరెంటు ఎప్పు డు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రాత్రివేళల్లో పొలాలకు వెళ్లాల్సి రావడం, మోటార్ల వద్ద వేచి ఉండటం, తక్కువ వోల్టేజీతో పంపుసెట్లు దెబ్బతినడం వంటి సమస్యలతో రైతులు నష్టపోతున్నారు. విద్యుత్తు అంతరాయాలతో పంటకు సరైన సమయంలో నీరు అందకపోతే దిగుబడి తగ్గుతుంది. పంట…
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/opinions/telangana-farmers-protest-power-shortages-amid-dry-weather-conditions-2538255
framing not published · 1 outlet covered this story, below the floor for a split