NTR DRAGON: భుజం గాయం నుంచి కోలుకున్న ఎన్టీఆర్.. ‘డ్రాగన్’ షూటింగ్‌లోకి రీఎంట్రీ!
V6 Velugu · V6 Velugu · 1 min read at V6 Velugu
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతోన్న క్రేజీ ప్రాజెక్ట్ ‘డ్రాగన్’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ అప్డేట్ను అందించారు నిర్మాతలు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది.
భుజం గాయం కారణంగా కొన్నాళ్లుగా రెస్ట్ తీసుకున్న ఎన్టీఆర్ రీసెంట్గా సెట్లో జాయిన్ అయ్యాడు. ఈ షెడ్యూల్లో యాక్షన్ సీన్స్‌తోపాటు కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 1967 నేపథ్యంతో సాగే ఈ కథలో ఎన్టీఆర్ ‘లూగర్’ అనే పాత్రలో కనిపించనున్నట్టు ఇప్పటికే రివీల్ చేశారు. కథలో అంతర్జాతీయ మాఫియా, అఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీ వంటి అంశాలు కీలకంగా ఉండనున్నట్టు గ్లింప్స్ ద్వారా చూపించారు.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/jr-ntrs-dragon-begins-new-shooting-schedule-at-ramoji-film-city
framing not published · 1 outlet covered this story, below the floor for a split