ఓపెన్ అయిన 5 నిమిషాల్లో 85% జియో ఐపీఓ షేర్లకు బిడ్డింగ్.. ఇన్వెస్టర్లకు బ్రోకరేజీలు కీలక సూచన?
V6 Velugu · V6 Velugu · 2 min read at V6 Velugu
స్టాక్ మార్కెట్ చరిత్రలో సరికొత్త సంచలనానికి తెరలేపుతూ ప్రారంభమైన రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి ఊహించని భారీ స్పందన లభించింది. మార్కెట్లో ఐపీఓ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ఇన్వెస్టర్లు ఎగబడి బిడ్లు దాఖలు చేశారు. దీంతో ఏకంగా 85 శాతం షేర్లకు బిడ్డింగ్స్ జస్ట్ 5 నిమిషాల్లోనే జరగడం జియో క్రేజ్‌కు నిదర్శనం. భారత్‌లోనే అతిపెద్ద ప్రైమరీ ఆఫరింగ్గా వస్తున్న ఈ ఐపీఓపై మార్కెట్ వర్గాల్లో విపరీతమైన అంచనాలు కొనసాగుతున్నాయి.
యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి సూపర్ స్పందన: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకి యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి అసాధారణ స్పందనను రాబట్టింది. దేశీయ మ్యూచువల్ ఫండ్స్, గ్లోబల్ ఫండ్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి ఏకంగా రూ. 2లక్షల 50వేల కోట్లకు పైగా భారీ డిమాండ్ లభించగా.. కంపెనీ ఏకంగా 212 యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా రూ.8వేల 110 కోట్లను సమీకరించింది. ఈ బలమైన డిమాండ్ ఇప్పుడు రిటైల్, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లలో భారీ నమ్మకాన్ని పెంచింది.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/jio-platforms-ipo-day-1-frenzy-massive-investor-response-and-85-bidding-in-minutes
framing not published · 1 outlet covered this story, below the floor for a split